విక్రమ్ కె.కుమార్, త్రివిక్రమ్ , సురేందర్‌రెడ్డిలతో వరుసగా సినిమాలు చేయబోతున్న అల్లు అర్జున్
కొత్త చిత్రాల్ని ముందుగానే ప్రకటిస్తుంటారు అల్లు అర్జున్. కానీ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తర్వాత ఆయన ఎవరితో సినిమా చేస్తారనేది స్పష్టం కాలేదు. ప్రస్తుతం విహార యాత్రలో ఉన్న అల్లు అర్జున్ ఒకేసారి మూడు చిత్రాల్ని ఖాయం చేసినట్టు సమాచారం.
విక్రమ్ కె.కుమార్, త్రివిక్రమ్, సురేందర్‌రెడ్డిలతో వరుసగా సినిమాలు చేయబోతున్నట్టు తెలిసింది. విక్రమ్ కె.కుమార్‌తో సినిమా ఉంటుందనే విషయం ఎప్పట్నుంచో ప్రచారంలో ఉంది. ఆ కలయికలోనే తదుపరి చిత్రం తెరకెక్కబోతోందని సమాచారం. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో చిత్రం కోసమే విక్రమ్ కె.కుమార్ కథని సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ‘అరవింద సమేత’ పూర్తయ్యాక త్రివిక్రమ్ దర్శకత్వంలోనూ, ‘సైరా’ తర్వాత సురేందర్‌రెడ్డితోనూ అల్లు అర్జున్ చిత్రాలు చేయబోతున్నట్టు సమాచారం. ఈ ముగ్గురు దర్శకులు చెప్పిన కథలు నచ్చడంతో అల్లు అర్జున్ ఇటీవలే పచ్చజెండా ఊపినట్టు తెలిసింది.


Very.
ReplyDeleteSuper